అక్షరటుడే, బోధన్: డబ్బులు రావట్లేదని ఓ వ్యక్తి ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసిన ఘటన బోధన్ లో చోటు చేసుకుంది. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రాంగణంలోని ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు తీసేందుకు సిద్ధాపూర్ గ్రామానికి చెందిన మహేష్ వెళ్లాడు. డబ్బులు రాకపోగా కోపంతో మిషన్ అద్దాన్ని ధ్వంసం చేశాడు. బంక్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి ఎస్బిఐ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఐ వీరయ్య సంఘటనా స్థలానికి వచ్చి నిందితడు మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో నిందితుడి చేతికి గాయం కాగా.. చికిత్స నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ బంక్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వీరయ్య తెలిపారు.