తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

0

అక్షరటుడే, ఇందూరు: నగరంలోని గాజుల్ పేటలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకెళ్లారు. ఈ ఘటనపై రెండో టౌన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్థానికంగా నివాసముండే వాసు గౌడ్ కొద్ది రోజుల కిందట ఇంటికి తాళం వేసి వెళ్లాడు. శుక్రవారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. బీరువాలో దాచి ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాలు, వెండితో పాటు రూ.2 లక్షలు అపహరించుకెళ్ళారు. ఇంఛార్జి ఏసిపి విజయసారథి, నగర సీఐ నరహరి, ఎస్సై అశోక్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు.