Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: దళితబంధు కింద అర్హులైన వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతూ అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దరఖాస్తుదారులు గురువారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం దళితబంధుకు తమను ఎంపిక చేసిందని, వెరిఫికేషన్ కూడా పూర్తయిందని తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధుల విడుదలను నిలిపివేశారన్నారు. ఎన్నికలు పూర్తవడంతో అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు.
Advertisement