దివ్యాంగ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

0

అక్షరటుడే, ఇందూరు: దివ్యాంగ ఉద్యోగుల జిల్లా శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గురువారం ఆవిష్కరించారు. ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పనిచేయడం గొప్ప విషయం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బి.శంకర్, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షుడు రాజన్న, కోశాధికారి బసవయ్య, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, హన్మండ్లు, దత్తు, వెంకటేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.