దోమకొండ లో యువకుడి సూసైడ్ కలకలం

Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: దోమకొండ మండలం అంబారీపెట్ లో యువకుడు బాల్ చంద్రం ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. తన చావుకు పూర్తి బాధ్యులు గ్రామ సర్పంచ్ మహమ్మద్ సలీం, పుట్ట శ్రీనివాస్, పుట్ట బాల్ నర్సు అని వాట్సప్ లో సూసైడ్ లేఖ రాశాడు. అనంతరం గ్రామ శివారులో ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. అంబారీపెట్ గ్రామ పంచాయతీ ముందు మృతుడు బాల్ చంద్రంకు 450 గజాల ఖాళీ స్థలం ఉంది. దాన్ని బీఆర్ఎస్ సర్పంచ్ సలీం కబ్జా చేశాడని, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. రాత్రికిరాత్రి ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో తన ప్లాట్ కబ్జా చేశారని, గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగానే తన భూములు లాక్కున్నారని పేర్కొన్నాడు. తనకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీఎం రేవంత్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రమణ్ రెడ్డిని సూసైడ్ లేఖ ద్వారా కోరుకున్నాడు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  ACB Raids | దూకుడు పెంచిన ఏసీబీ.. ఇక వారే టార్గెట్‌