నగరంలో పోకిరీల వికృత చేష్ట
అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో పోకిరీల ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతున్నాయి. ఆసుపత్రికి వెళ్తున్న దంపతులపై నకిలీ తుపాకి ఎక్కుపెట్టి భయపెట్టారు. ఆపై నవ్వుతూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఖలీల్వాడిలో ఈ ఘటన చోటు చేసుకొంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను వెనుకాల మరో వాహనం పైన వచ్చిన ముగ్గురు పోకిరీలు నకిలీ తుపాకితో భయపెట్టారు. ఈ ఘటనతో వారు ఒక్కసారిగా ఆందోళన చెందారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. నిందితులు ముగ్గురిని ఒకటో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.