నగరంలో భారీ అగ్ని ప్రమాదం

0

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరంలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దేవి రోడ్డులో గల బాలాజీ సానిటరీ భవనంలో మంటలు వ్యాపించగా ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు ఫైర్ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనం పూర్తిగా దగ్ధం కాగా.. రూ.30 లక్షలు వరకు ఆస్థి నష్టం జరిగినట్లు తెలిసింది.