నగరంలో మొదలైన ప్రజాపాలన

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరంలో ప్రజాపాలన కార్యక్రమం మొదలైంది. స్థానిక శివాజీనగర్ లో ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ గురువారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. స్థానిక కార్పొరేటర్ బంటు వైష్ణవి రాము, తదితరులు పాల్గొన్నారు.

Advertisement