అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని ఖిల్లా రోడ్డులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. పాడుబడిన భవనంలో వ్యక్తిని హతమార్చి తగులబెట్టారు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రెండో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిని పోలీసు అధికారులు పరిశీలించారు. మృతుడు ఎవరు? ఇక్కడ ఎందుకు హతమార్చి తగులబెట్టారు? అన్నది తేలాల్సి ఉంది.