అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నవిపేట్ రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న రాయచూర్ ఎక్స్ప్రెస్ రైలులో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రైల్వేస్టేషన్ ఎస్సై సాయిరెడ్డి కథనం ప్రకారం.. రాయచూర్ రైలులోని ఎస్ 1 కోచ్ లో నిద్రిస్తున్న ఓ మహిళ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగును దుండగుడు దొంగిలించి పారిపోగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా నవిపేట్ కు చెందిన నిందితుడు షేక్ సలీం చోరీ చేసినట్లు గుర్తించారు. విచారణలో భాగంగా అతని నుంచి వన్ ప్లస్ సెల్ ఫోన్, లెనోవా ట్యాబ్ ను సీజ్ చేశారు. గురువారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సిబ్బంది మహబూబ్, రవికిరణ్,రాములు, నజ్మ, సలావుద్దీన్ పాల్గొన్నారు.