అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం ఘోరం చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కే సమయంలో ప్రమాద వశాత్తు ఓ బాలిక ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయింది. ఆమెను కాపాడేందుకు తండ్రి ప్రయత్నించగా ఆయన కూడా అందులోనే ఇరుక్కున్నాడు. ఘటన స్థలంలోనే వీరిద్దరు మృతి చెందారు. మృతులు రంగారెడ్డి మేడ్చల్ జిల్లా చింతల్ గ్రామానికి చెందిన.. చెలిమెల రామచంద్రరావు(40) అతని చిన్న కూతురు చెలిమెల జనని(14)గా రైల్వే పోలీసులు గుర్తించారు. బేగంపేట్ నుంచి వీరి కుటుంబం బాసరకు వెళ్తున్నారు. నిజామాబాద్ స్టేషన్ లో రైలు ఆగిన సమయంలో నీటి బాటిల్ కోసం కిందికి దిగగా ఈ ఘటన చోటు చేసుకుంది.