అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ సీపీగా కల్మేశ్వర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. 2012 బ్యాచ్ కు చెందిన కల్మేశ్వర్ ప్రస్తుతం హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా పని చేస్తున్నారు. ఈయన భార్య రోహిణీ ప్రియదర్శిని మెదక్ ఎస్పీగా ఉన్నారు. విధుల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని సమాచారం.