నిజాయితీ చాటుకున్న కండక్టర్

0

అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ బస్ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సుచరిత్ నిజాయితీని చాటుకున్నారు. రెండు రోజుల క్రితం ఆర్మూర్ నుంచి నందిపేట్ వెళ్ళే బస్సులో విధులు నిరహిస్తుండగా ఓ ప్రయాణికుడు మొబైల్ ఫోన్, పర్స్ మర్చిపోయాడు. వివరాలు సేకరించి తిరిగి ప్రయాణికుడికి అప్పగించాడు. బుధవారం ఆర్మూర్ నుంచి వేల్పూర్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ తన పర్స్ బస్సులో మరిచిపోయింది. ప్రయాణికురాలికి తిరిగి పర్సును అప్పగించారు. అందులో అర్ధతులం బంగారు ఉంగరం, డబ్బులు ఉండగా వాటిని ప్రయాణికురాలికి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ సుచరిత్ ను పలువురు అభినందించారు.