అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తన జీతాన్ని ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారు. మొదటి నెల జీతాన్ని గాంధారి మండలం సర్వాపూర్‌కు చెందిన నిరుపేద అయిన వెంకట్ కుటుంబం ఇల్లు నిర్మాణం కోసం కేటాయిం చారు. ఎమ్మెల్యే మాట నిలబెట్టుకోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Advertisement
Advertisement