నేను అవినీతి చేయను.. చేసేవారిని సహించను

0

అక్షరటుడే, ఆర్మూర్: తాను అవినీతి చేయనని, చేసేవారిని సహించనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమేనని, పచ్చని పల్లెల్లో రాజకీయా బేధాలు లేకుండా అందరూ కలిసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. పార్టీలకు ఆతీతంగా తాను ప్రజల కోసం పని చేస్తానని వెల్లడించారు. గ్రామాల్లో విద్య, వైద్యం, ఉపాధికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రభాకర్, సర్పంచ్ వెంకన్న, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.