పట్టపగలు హెడ్ కానిస్టేబుల్ పైన దాడి

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ లో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక గంగాస్థాన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయాలపాలైన హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఎవరు, ఎందుకు దాడి చేశారు? అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.