పర్యాటక కేంద్రంగా నాగన్న దిగుడు బావి

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండల కేంద్రంలోని పురాతన కట్టడమైన నాగన్న దిగుడు బావి పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం బావి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే నాగన్న దిగుడు బావి పర్యాటక కేంద్రంగా మారుతుందని తెలిపారు. బావి విస్తీర్ణం కొలసి హద్దులను పాతాలని అధికారులకు సూచించారు. పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుధాకర్, ఎంపీడీవో మల్లికార్జున్ రెడ్డి, ఎంపీఓ ప్రభాకర్ చారి తదితరులు పాల్గొన్నారు.