అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల్లో బుధవారం ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోగి మంటలు వేశారు. అనంతరం రంగోలి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు పతంగులను ఎగురవేశారు. ఆర్మూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల, క్రాంతి హైస్కూల్, లింగంపేట కస్తూర్బా పాఠశాలల్లో నిర్వహించారు.

