అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఎదుట బీజేపీ, ఎబీవీపీ నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఓ వర్గానికి చెందిన మత బోధన చేస్తున్నాడని వారు ఆరోపించారు. బాధ్యులు, పాఠశాల నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ మహేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టిన వారిని సముదాయించారు. ఘటనపై విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement