పాన్‌షాపులో గంజాయి విక్రయం

0

అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోంది. తాజాగా గురువారం నగరంలోని గుర్బాబాది రోడ్డులో గల కోరి కమల్‌ సింఘ్ పాన్‌షాపులో గంజాయి పట్టుబడింది. ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పాన్‌షాపై దాడి చేసి 550 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. నిందితుడిని నిజామాబాద్‌ ఎస్‌హెచ్‌వోకు అప్పగించగా వారు కేసు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ విలాస్‌, ఎస్సై గంగాధర్‌, సిబ్బంది సలీం, సాగర్‌రావు, గోపి, కార్తీక్‌, కిరణ్‌కుమార్‌, రాజు పాల్గొన్నారు.