పేకాట స్థావరంపై పోలీసుల దాడి

0

అక్షరటుడే, బోధన్: కమిషనరేట్ లోని బోధన్ పట్టణంలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి జరిపారు. 14 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.42 వేలు సీజ్ చేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐలు అంజయ్య, అజయ్ బాబు తెలిపారు. బోధన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.