అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని రూరల్, మూడో టౌన్ పరిధిలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి జరిపారు. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్ఫోర్స్ సీఐ అజయ్ బాబు అధ్వర్యంలో ఆదివారం రాత్రి తనిఖీలు జరిపారు. రెండు స్థావరాల్లో 20 మంది పేకాట రాయుళ్లు, రూ.85,200 నగదును సీజ్ చేశారు. అనంతరం ఆయా స్టేషన్లలో జుదరులపై కేసు నమోదు చేసుకున్నారు.