అక్షరటుడే, ఇందూరు: ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదలకు సంఘం అండగా నిలవాలని అర్బన్ శాసనసభ్యుడు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. శుక్రవారం నగరంలోని శ్రీరామ గార్డెన్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ ను సద్విని యోగించుకోవాలన్నారు. ఆర్యవైశ్యులందరూ రాజకీయాలు పక్కన పెట్టి సంఘ అభివృద్ధికి సహకరించాలన్నారు. అంతకుముందు కంఠేశ్వర్ ఆలయం నుంచి శ్రీరామ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సంఘం పట్టణ అధ్యక్షుడు కొండ వీరశేఖర్, ప్రధాన కార్యదర్శి దేవత చంద్రశేఖర్, కోశాధికారి వెంకటేష్, కార్పొరేటర్ ఇల్లెందుల మమత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.