అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: కమిషనరేట్ లోని మోపాల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్టేషన్ లో ఉన్న పోలీసు సిబ్బంది మంటలు అర్పివేసి బాధితుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు మండలంలోని సింగంపల్లికి చెందిన రాజుగా గుర్తించారు. భార్య కాపురానికి రావట్లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.