అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మండలం కొత్తబాది ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం దూప్యాను సస్పెండ్ చేసినట్లు కామారెడ్డి డీఈవో రాజు తెలిపారు. ఒకటో తరగతి విద్యార్థి ఫర్హాన్ మంగళవారం పాఠశాల పక్కనే ఉన్న కాలువలో పడి మృతి చెందగా.. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. విధుల్లో ఉండాల్సిన ప్రధానోపాధ్యా యుడు రిజిస్టర్లో సంతకం చేసి వేరే గ్రామానికి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. కాగా.. ప్రాథమిక విచారణ అనంతరం హెచ్ఎం దూప్యాను సస్పెండ్ చేశారు.
Advertisement
Advertisement