Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ నగరం: ప్రభుత్వం కేవలం 5 శాతం ఐఆర్ ను ప్రకటించడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ లో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం శంకర్ భవన్ పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేసి, ఐఆర్ ను 20 శాతం కు పెంచాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ళ సురేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాసుదేవరావు, సంఘం జిల్లా బాధ్యులు పి.లింబయ్య, జి.గోపి తదితరులు పాల్గొన్నారు.
Advertisement