అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) సలహాదారుగా షబ్బీర్ అలీ నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో సలహాదారు పోస్టులో నియమిస్తూ.. సీస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి షబ్బీర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెడతారని ప్రచారం జరిగింది. మరోవైపు షబ్బీర్ కు అడ్వైజర్ పోస్టు ఇవ్వడంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రూట్ క్లియర్ అయ్యింది. అతిత్వరలో జిల్లా నేతకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే మహేశ్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. త్వరలోనే మరి కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.