అక్షరటుడే, నిజామాబాద్: మాక్లుర్ మండలంలో ప్రసాద్ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. మండలంలోని మదన్ పల్లిలో గల ఓ గార్డెన్ పక్కన శవాన్ని పూడ్చిన ఆనవాళ్లు బయటపడ్డాయి. కస్టడీ పిటీషన్ లో ఉన్న నిందితుడు ప్రశాంత్ ను గురువారం ఉదయం మదన్ పల్లికి తీసుకురానున్నారు. రెవెన్యూ, ఫోరెన్సిక్ వైద్యుల బృందం సమక్షంలో శవాన్ని వెలికి తీయనున్నారు. అక్కడే శవానికి పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియల నిమిత్తం కుటుంబీకులకు అప్పగిస్తారు. నిందితుడు.. ప్రశాంత్ తన స్నేహితుడు ప్రసాద్ తో పాటు అతని కుటుంబీకులు ఐదుగురిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరుగురి హత్యోదంతం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.