బస్సు ఢీకొని ఒకరి మృతి

0

అక్షరటుడే, ఆర్మూర్: జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేష్(67) మృతి చెందాడు. చేపూర్ గ్రామానికి చెందిన రమేష్ తన సైకిల్ పై పెర్కిట్ సమీపంలో రోడ్డు దాటుతుండగా నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీకొంది. ఘటన స్థలంలోనే వృద్ధుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.