అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట్ మండలంలోని పోల్కంపేట్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తలారి పోచయ్య కుటుంబానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ దత్త ఆశ్రమం తరుపున ఆర్థిక సాయం అందించారు. గ్రామ ఎస్ఎంసీ ఛైర్మన్ ఆర్కారి ఆగమయ్య గురువారం బాధిత కుటుంబానికి రూ.5 వేలు సాయం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మా నాగరాజు, ఉపసర్పంచ్ రామానుజచారి, యాదగిరి, నరేష్, రాములు, తదితరులు పాల్గొన్నారు.