అక్షరటుడే, బాన్సువాడ: పట్టణ రెడ్డి సంఘం అధ్యక్షుడిగా మాసాని అశోక్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ సభ్యులందరు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అశోక్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు పలువురు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్డి సంఘం అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.