బాలికను మంటల్లోకి విసిరేసిన తండ్రి

0

అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఏడేళ్ల కుమార్తెను కాలుతున్న గడ్డివాము మంటల్లో విసిరేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. బీర్కూర్ మండలంలోని బరంగెడ్గిలో ఓ గడ్డి వాముకి నిప్పంటుకుంది. అక్కడే ఆడుకుంటున్న చిన్నారుల వల్లే నిప్పు అంటుకుందని గంగాధర్ ఆరోపించారు. ‘మీ కుమార్తె అంకిత మా గడ్డివాముకు నిప్పటించింది’ అంటూ గంగాధర్.. సాయిలుతో గొడవ పడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయిలు కోపంతో తన కుమార్తె అంకితను కాలుతున్న గడ్డి వాములోకి విసిరేశాడు. వెంటనే అప్రమత్తమైన గంగాధర్ గడ్డివాములోకి దూకి పాపను రక్షించాడు. బాలికకు కాలిన గాయలవ్వగా . చికిత్స నిమిత్తం 108 వాహనంలో బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.