Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: ప్రజల సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్ కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ అన్నారు. రాజంపేట మండలం గుడి తండాకు చెందిన సర్పంచి దేవిసింగ్ ఆధ్వర్యంలో పలువురు సోమవారం కాంగ్రెస్ లో చేరారు. మదన్ మోహన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల వల్ల ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఎల్లారెడ్డిని అన్ని విధాలుగా అభివృద్ధి. చేస్తానని హామీ ఇచ్చారు.
Advertisement