బీఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: కేసిఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రూరల్ మండలం మంచిప్ప సర్పంచి సిద్ధార్థ ఆధ్వర్యంలో ఒడ్డెర కులానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నియోజకవర్గంలో తన హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేశానన్నారు.