అక్షరటుడే, ఆర్మూర్: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఆర్మూర్ లో కేసీఆర్ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ స్టేజి పైన ఓ అంగన్వాడీ టీచర్ కనిపించటం తీవ్ర చర్చకు దారి తీసింది. పెర్కిట్ లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ తార జీవన్ రెడ్డికి మరదలు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఆమె పార్టీ కార్యక్రమంలో పాల్గొనటం గమనార్హం. జిల్లా ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఈమె అంగన్వాడీ యూనియన్ తో పాటు టీఎన్జీవోలో క్రియాశీలకంగా ఉన్నారు.