అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడిగా సుభాష్ పద్మ ఎన్నికయ్యారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజు, జాతీయ బీసీ సంఘం ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్ శనివారం నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారికి సుభాష్ ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ నగరంలో సంఘం బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.