అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ ఆర్యన్ రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోల్కంపేట్ గ్రామానికి చెందిన రైతు తలారి కిష్టయ్య మృతి చెందగా అతని ఖాతాలో నుంచి ఈనెల 26న డబ్బులు డ్రా చేయడంతో గురువారం బ్యాంకు వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. బ్యాంక్ సిబ్బంది, మేనేజర్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మృతుడు కిష్టయ్య కుమారుడు సాయిబాబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్సై ప్రభాకర్ వెల్లడించారు.