భర్తను హతమార్చిన భార్య

0

అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మండలం మొగులాంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను ఓ కసాయి భార్య హతమార్చింది. కుమారుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ మండలం మోగులాంపల్లి గ్రామానికి చెందిన రామ గౌడ్(55) మృతదేహాన్ని బుధవారం గ్రామ శివారులో గుర్తించారు. కుటుంబ కలహాలతోనే భార్య, కుమారుడు కలిసి రామ గౌడ్ ను హత్య చేసి ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.