భవానీ భక్తుల నిరసన

0

అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి భవానీ భక్తులు నిరసన తెలిపారు. చంద్రనగర్ లో అమ్మవారి పల్లకి సేవ తీస్తుండగా పోలీసులు డీజేను తీసుకుని వెళ్లారని వారు ఆరోపించారు. ఒకవైపు పొలిటికల్ లీడర్లు బతుకమ్మ వేడుకల్లో డీజే ఏర్పాటు చేస్తే పట్టించుకోని పోలీసులు నవరాత్రుల కోసం ఏర్పాటు చేసిన వాటిని సీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని సర్ది చెప్పటంతో వారు ఆందోళన విరమించారు.