భీంగల్ సీఐగా నాగపురి శ్రీనివాస్

0

అక్షరటుడే, బాల్కొండ: కమిషనరేట్ లోని భీంగల్ సీఐగా నాగపురి శ్రీనివాస్ నియమితులయ్యారు. నిర్మల్ డీసీఆర్బీలో పనిచేస్తున్న ఆయన్ను ఇక్కడికి బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న అంకటి వెంటేశ్వర్లును ఐజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులో పేర్కొన్నారు.

త్వరలో మరికొందరు..

కమిషనరేట్ లో 8 మంది సీఐల బదిలీల జాబితా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో నియమితులైన వారందరినీ మార్చేందుకు అయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నేతలు జిల్లా ఇంఛార్జి మంత్రి ద్వారా పలువురి పేర్లను పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాను ఒకే చేస్తారా? లేక వేరే వారిని నేరుగా నియమిస్తారా? అనేది స్పష్టత లేదు. అతిత్వరలో బదిలీల ప్రక్రియ ఉండనున్నట్లు సమాచారం.