అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో ఓ నేత రైస్ కుక్కర్లు పంచటం హాట్ టాపిక్ గా మారింది. ఆ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. పలువురికి కుక్కర్లు అందక పోవటంతో ‘మాకు కుక్కర్’ అందలేదంటూ జనం ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారట. ఇంకా ఎన్నికల కోడ్ కూడా అమలు కాకముందే నేతలు ఈ స్థాయిలో ప్రచారం చేస్తుంటే.. పోలింగ్ సమయంలో మరెన్ని తాయిలాలు ఇస్తారో అని చర్చ జరుగుతోంది.