మాధవ నగర్ రైల్వే గేటు దారి మూసివేత

0

అక్షరటుడే, నిజామాబాద్: మాధవ నగర్ రైల్వే గేట్ దారిని తాత్కాలికంగా మూసివేశారు. నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అర్వోబీ పనుల కారణంగా వచ్చే నెల 24 వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. బుధవారం ట్రాఫిక్ పోలీసులు గేట్ మూసివేస్తున్నట్లు ఫ్లెక్సీలతో బారికెడ్లు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచి రైల్వే గేట్ కూడా మూసి ఉంటుందని అధికారులు వెల్లడించారు.