అక్షరటుడే, నిజామాబాద్: కంటేశ్వర్ సీఎస్ఐ చర్చి వద్ద ఓ వృద్ధురాలిని నిలువు దోపిడి చేశారు. గురువారం సాయంత్రం సాయిబాబ గుడికి వెళ్ళి వస్తున్న వృద్ధురాలు చంద్రవ్వను చర్చి వద్ద ఇద్దరు వ్యక్తులు ఆపారు. చర్చిలో గిఫ్ట్స్ ఇస్తున్నారని ఆమెను నమ్మించి కంపౌండ్ లోనికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలు అపహరించు కెళ్ళారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.