అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని మూతబడిన శ్రీ గాయత్రీ కళాశాలలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి హౌజింగ్ బోర్డులోని కళాశాల భవనంలో మంటలు వ్యాపించడాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ తో మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.