మొరం టిప్పర్లు, జేసీబీలు సీజ్

Advertisement

అక్షరటుడే, బోధన్: అక్రమ మైనింగ్ పై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఏసిపి రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో సీఐలు అంజయ్య, అజయ్ బాబు బుధవారం రెంజల్ మండలం సాటాపూర్ లో తనిఖీలు చేశారు. అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్న రెండు జేసీబీలు, ఏడు టిప్పర్లను సీజ్ చేశారు. రెంజల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల సాయంతోనే అక్రమ మైనింగ్ కొనసాగుతుండటం గమనార్హం.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  BODHAN | మొరం టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు