యువకుడి అనుమానాస్పద మృతి

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: జక్రాన్ పల్లి మండలంలో ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. పుప్పాల పల్లి గ్రామానికి చెందిన మహేష్(29) స్థానిక ఊర చెరువులో శవమై కనిపించాడు. గత శనివారం యువకుడు మరో ఇద్దరితో కలిసి మద్యం తాగాడు. ఆ తర్వాత నుంచి అదృశ్యం కాగా కుటుంబీకులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం ఊర చెరువు సమీపంలో మృతుడి ఏటీఎం కార్డు లభించగా.. చెరువులో మృతదేహం ఉన్నట్లు బయటపడింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కాగా.. ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.