రాజబహదూర్ వెంటకరామరెడ్డి సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ( Vemula Prashant Reddy) అన్నారు.

నిజామాబాద్ : రాజబహదూర్ వెంటకరామరెడ్డి సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ( Vemula Prashant Reddy) అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌బీవీఆర్‌ఆర్ కాంస్య విగ్రహాన్ని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా (Mla Ganesh Gupta)తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యతోనే వికాసం, అభివృద్ధి సాధ్యమని గుర్తించి 80 ఏండ్ల క్రితమే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో రెడ్డి హాస్టళ్లు (Hostels), విద్యా సంస్థలు( Educational Institutes) నెలకొల్పారన్నారు. రెడ్డి కులస్తుల అభ్యున్నతి కోసం రాజ బహదూర్ వెంకట రామరెడ్డి అందించిన సేవలు ఎంత ప్రశంసించిన తక్కువేనని కొనియాడారు. విద్యవ్యాప్తికి కృషి చేసిన ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రెడ్డి హాస్టళ్లు, విద్యా సంస్థల కోసం మునుపెన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్(CM KCR) హైదరాబాద్‌లో 15 ఎకరాల స్థలం, రూ. 10 కోట్ల నిధులు కేటాయించారన్నారు. ఆర్‌బీవీఆర్‌ఆర్ సేవలకు జ్ఞాపకార్థంగా ఆయన జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ఈగ సంజీవ్‌రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్ ఉమారాణి పాల్గొన్నారు.