రామన్నను కలిసిన సోమన్న

0

అక్షరటుడే, హైదరాబాద్: ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న శుక్రవారం మంత్రి కేటీఆర్ ను కలిశారు. బీఆర్ఎస్ నాయకులతో కేటీఆర్ వద్దకు వెళ్ళారు. ఈ సందర్భంగా సోమన్న ను మంత్రి కేటీఆర్ ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రజా గాయకుడిగా పేరు సంపాదించిన ఏపూరి కొంత కాలంగా తన పాటల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్నారు. బహుజన వాదం నినాదంగా ఈయన పాడిన పలు పాటలు ప్రజలను ఎంతో ఆకర్షించాయి. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో ఏపూరి సోమన్న అధికారికంగా చేరనున్నట్లు సమాచారం.