రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్

0

అక్షరటుడే, జుక్కల్: పదేళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం ప్రజాపాలనలో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాల వల్లే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ కు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే రెండు హామీలను అమలు చేశామని గుర్తుచేశారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.