రూరల్ కానిస్టేబుల్ మహేష్ పై పోక్సో కేసు

0

అక్షరటుడే, నిజామాబాద్: కమిషనరేట్ లోని రూరల్ పీఎస్ కానిస్టేబుల్ మహేష్ పైన పోక్సో కేసు నమోదైంది. ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు రూరల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మహేష్ పరారీలో ఉన్నట్లు సమాచారం. గతంలో ఓ భార్యాభర్తల వివాదంలో తలదూర్చి మహేష్ సస్పెండ్ అయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు సస్పెన్షన్ లో ఉన్నాడు. తీరా ఓ కాంగ్రెస్ నేత ఒత్తిడి ద్వారా తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మళ్లీ రూరల్ పీఎస్ లోనే పోస్టింగ్ ఇచ్చారు. నిందితుడి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కోసం తాజాగా మండలంలోని ఓ గ్రామానికి వెళ్లిన మహేష్ అక్కడ బాలిక పట్ల అసభ్యంగా వ్యవహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ జరిపి పోక్సో కేసు నమోదు చేశారు. ఈ అంశంపై సీపీ కల్మేశ్వర్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసిన కానిస్టేబుల్ మహేష్ కు తిరిగి పాత స్థానంలోనే ఎలా పోస్టింగ్ ఇచ్చారన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది.